KMM: కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
'రేపు ప్రజావాణి కార్యక్రమం'


