హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైవేపై కారు దగ్ధం..!

RR: శంషాబద్ దగ్గర హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారులో నుంచి దిగాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే కారు దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.