హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపీనాథ్ పట్నాయక్‌కు మంత్రి సత్కారం

VZM: హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో వంశీ ANR కామధేను జాతీయ పురస్కారం అందుకున్న పక్కి గోపీనాథ్ పట్నాయక్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సత్కరించారు. విజయనగరానికి చెందిన గోపీనాథ్ పట్నాయక్‌కు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఉత్తమ ప్రజా సంబంధాల వ్యక్తి విభాగంలో జాతీయ పురస్కారం లభించడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.