హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యలంకలో పోటీలను పరిశీలించిన ఆర్డీవో

బాపట్ల సూర్యలంక బీచ్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆర్డీవో హరికుమార్‌ ఆదివారం పరిశీలించారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతను ప్రోత్సహించారు. అనంతరం సింగింగ్‌ పోటీలను వీక్షించారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.