MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు దీకొండ వెంకన్న గౌడ్ సోదరి కేక్కర్ల నీలమ్మ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత మృతురాలి చిత్రపటానికి పూలు ఘటించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి పరామర్శ


