ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్‌లో భారత్‌కు రజత పతకం లభించింది. ఫైనల్ పోటీల్లో భారత అథ్లెట్ ఆన్సీ సోజన్ 6.53 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. చైనా అథ్లెట్ హువాంగ్ యింగ్‌యింగ్ 6.55 మీటర్లు దూకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా, ఇదే పోటీలో పాల్గొన్న మరో భారత అథ్లెట్ శైలీ సింగ్ 6.42 మీటర్ల ప్రదర్శనతో 4వ స్థానంలో నిలిచింది.
క్రీడలు
లాంగ్ జంప్‌లో భారత్‌కు రజతం


