హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా 64 వార్షిక బ్రహ్మోత్సవాలు

JGL: జగిత్యాల 50వ వార్డు పురానిపేటలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆలయ 64వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు సమర్పించిన ఓడి బియ్యంతో అన్నప్రసాదం చేసి భక్తులకు పంపిణీ చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.