హైదరాబాద్: 28°C
తెలంగాణ

భువనగిరి ఖిల్లాపై పర్యాటక దినోత్సవం

BHNG: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి ఖిల్లాపై యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఇన్‌ఛార్జి కలెక్టర్ భాస్కర్ రావు హాజరై మాట్లాడారు. పర్యాటక రంగ అభివృద్ధిలో డిజిటల్ టెక్నాలజీను విస్తృతంగా వినియోగించాలన్నారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.