MHBD: కురవి మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ టీచర్ బండారి ఉమా మహేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగాని శ్రీనివాస్ గౌడ్, ఆలయ ఛైర్మన్ రవీందర్‌రెడ్డి ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
తెలంగాణ
అంగన్వాడీ టీచర్ ఉమా మహేశ్వరికి నివాళులు


