VKB: తాండూరు మండలం గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల నిరక్షరాస్య మహిళలకు ఆదివారం 'ఉల్లాస్' పరీక్షలు ఉత్సాహంగా జరిగాయి. మొత్తం 30 పరీక్ష కేంద్రాల్లో 450 మందికి గాను 351 మంది హాజరై పరీక్ష రాశారు. ఈ కేంద్రాలను డీపీఎం శేఖర్ పరిశీలించి, సంఘాల్లోని ప్రతి మహిళను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం బాలయ్య, సీసీ సయ్యద్, దీప పాల్గొన్నారు.
తెలంగాణ
మండలంలో 'ఉల్లాస్' పరీక్షలు


