హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆదివారం మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, భూస్వాములపై ధైర్యంగా పోరాడిన ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమని, ఆమె పోరాటం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.