హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండలో తైక్వాండో ఛాంపియన్‌ షిప్‌

NLG: నల్గొండలో 5వ యునైటెడ్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌ 2026–27 పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌ పోటీలను ప్రారంభించారు. తైక్వాండోతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి అక్బర్‌ అలీ, అసోసియేషన్‌ ప్రతినిధులు, కోచ్‌లు, న్యాయనిర్ణేతలు పాల్గొన్నారు.