ములుగు జిల్లా సంక్షేమ భవన్‌లో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీఅభివృద్ధి అధికారి బి.రామ్మోహన్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, స్వాతంత్య్ర సమరం, బీసీల అభ్యున్నతికి ఆయన చేసినసేవలను స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను నిరంతరం స్మరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ
'కొండా లక్ష్మణ్ బాపూజీకు ఘన నివాళి'


