హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కాంగ్రెస్ నిరసన ధర్నా: ఆడే గజేందర్

ADB: కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ ప్రక్రియ అవకతవకలపై సీఈవో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఈ నెల 28న ఆదిలాబాద్‌లో నిరసన చేపట్టనున్నట్లు బోథ్ ఇన్‌ఛార్జి ఆడే గజేందర్ తెలిపారు. డీసీసీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.