హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్లూరులో టింబర్ డిపోలోకి దూసుకెళ్లిన లారీ

కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిపై కల్లూరు హంద్రీ బ్రిడ్జి సమీపంలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దిగువ ప్రాంతంలోని టింబర్ డిపోలోకి దూసుకెళ్లింది. ఘటనతో అక్కడివారు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.