హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయాల కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు

NZB: నిజామాబాద్ కేంద్రంలో ఆదివారం గ్రామస్తులు సమావేశమై ఆలయాల అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోగిడి రవి, ప్రధాన కార్యదర్శిగా దేశ్ పేట్ పోశెట్టి, కోశాధికారిగా రొయ్యల రెడ్డిలను ఎన్నుకున్నారు. వీరితోపాటు పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. పాత పాలకవర్గం నూతన కమిటీ సభ్యులు బాధ్యతలను అప్పగించారు.