JN: రఘునాథపల్లి మండలం బాంజీపేటలో మద్యపాన నిషేధంపై మహిళలు, యువకులు, గ్రామపంచాయతీ పాలకవర్గం, కుల పెద్దలు, మద్య నిషేధ కమిటీ సభ్యులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ నుంచి గ్రామంలో మద్యం దుకాణాలు మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. మద్యం విక్రయాలు జరగకుండా గ్రామం తీసుకున్న నిర్ణయానికి బెల్ట్‌షాపుల నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
మద్యపాన నిషేధంపై బాంజీపేటలో ర్యాలీ


