NTR: వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామ శివారులోని ఎత్తిపోతల పథకానికి సమృద్ధిగా నీరు చేరుతోంది. గత కొన్ని రోజులుగా వైరా కట్టలేరులో నీరు లేకపోవడంతో పథకం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం భారీ వర్షాలతో వరదనీరు పోటెత్తడంతో ఎత్తిపోతల పథకం తిరిగి రైతులకు ఉపయోగపడనుందని రైతులు తెలిపారు. సాగునీటి లభ్యత పెరగడంతో పంటలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పల్లంపల్లి ఎత్తిపోతల పథకం నీరు విడుదల


