NRML: నిర్మల్ కలెక్టరేట్‌లో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, కుల సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య, నిజాం వ్యతిరేక, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, సహాయ అధికారి సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి


