MNCL: చెన్నూరు మండలం లంబాడిపల్లి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా ముమ్మర తనిఖీలు నిర్వహించారు. పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 30 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. గుడుంబా తయారీకి ఉపయోగించే 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, నలుగురిని బైండోవర్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ బన్సీలాల్ హెచ్చరించారు.
తెలంగాణ
పోలీసుల ముమ్మర తనిఖీలు


