KMR: పిట్లం పట్టణ సమీప రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి బైక్పై వేగంగా వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం అదుపుతప్పి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలు


