హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు నుండి నీటి అక్రమ తరలింపు

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువు నీటిని పైప్‌లైన్‌ ద్వారా అక్రమంగా తరలిస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి తరలింపుకు జరుగుతున్న చర్యల గురించి అధికారులకు తెలిపినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు, రైతులు ఆరోపిస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.