హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి వినాయకుడే ముద్దు.. పర్యావరణమే ముఖ్యం

SDPT: జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని బొడ్రాయి వద్ద శివమ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 14వ ఏడాది మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈసారి రాధాకృష్ణ అవతారంలో రూపొందించిన వినాయకుడు భక్తులను ఆకట్టుకున్నాడు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా కృషి చేయాలని కోరారు.