హైదరాబాద్: 28°C
తెలంగాణ

'MBBS విద్యార్థికి ఎమ్మెల్యే కడియం ఆర్థిక సాయం'

HNK: ధర్మసాగర్ మండలం దేవునూర్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి చిట్యాల నితిన్‌కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం రెండో ఏడాది ఫీజు కోసం రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. గతేడాది కూడా నితిన్ మొదటి సంవత్సరం ఫీజుకు సాయం చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు విద్యార్థి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలన్నారు.