హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా రహదారి అంచు

PLD: నరసరావుపేట–రొంపిచర్ల ప్రధాన రహదారిలో అన్నవరం సమీపంలో రహదారి అంచు ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ దెబ్బతినడంతో కాలువ వైపు లోతైన గుంత ఏర్పడగా, ప్రమాద సూచికగా రాళ్లను మాత్రమే ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో అంచు కనిపించక వాహనాలు కాలువలో పడే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రక్షణ గోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.