కృష్ణా: గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) చేపట్టిన సమ్మె ఆదివారం పెడనలో ఆదివారం ఏడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా VRAలు పెడన పట్టణంలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. కనీస వేతనం, పే స్కేల్ అమలు, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. స్పందన లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పెడనలో VRAల నిరసన..!


