హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందూరు ఖజురహో ఎక్కడుందో తెలుసా..?

KMR: డిచ్‌పల్లి రామాలయాన్ని(ఖిల్లా రామాలయం) ‘ఇందూరు ఖజురహో’ అని పిలుస్తారు. ఈ పురాతన దేవాలయం గోడలపై ఉన్న అద్భుతమైన శిల్పాలు, భంగిమలు మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఖజురహో దేవాలయాన్ని పోలి ఉంటాయి. నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆలయంపై తురుష్కులు దాడి చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. 1949లో జైపూర్ నుంచి సీతారాముల పాలరాతి విగ్రహాలను తెప్పించి ప్రతిష్ఠించారు.