హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోటల్‌లో అగ్నిప్రమాదం.. సామాగ్రి దగ్ధం

కోనసీమ: జిల్లాలోని అమలాపురం సర్క్యులర్ బజార్‌లో ఉన్న గీతాస్ హోటల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టీ కాస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగినట్లు సమాచారం. వెంటనే హోటల్‌లో ఉన్న కస్టమర్స్ బయటకు పరుగులు తీశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.