హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక మణిహారం మన జిల్లా..!

TPT: ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, చారిత్రక వైభవంతో మన ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. తలకోన, హార్సిలీహిల్స్, కైలాసకోన ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చంద్రగిరి కోట, గుడిమల్లం ఆలయం చారిత్రక వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.