హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వైసీపీకి భారీ షాక్‌

VZM: వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. మెరకముడిదాం మండలంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను మాజీ సీఎం జగన్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. వీరంతా త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.