హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ అదుపు తప్పి ప్రమాదం.. వ్యక్తి మృతి

VSP: ఆనందపురం మండలంలోని అనకాపల్లి-ఆనందపురం 16వ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని గాజువాక మల్కాపురం పరిధిలోని పిలకవానిపాలెం ప్రాంతానికి చెందిన కర్ణపు అప్పల రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఘటనపై దర్యప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్‌ SI పాపారావు తెలిపారు.