హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో ఇద్దరు చిన్నారులు మృతి

నెల్లూరు నగరం హరినాధపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండవ లైన్‌లో మిద్దిపై ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా వాటర్ ట్యాంక్ నిండిపోవడంతో నీరు కిందకు వచ్చింది. మెయిన్ బోర్డు స్పీచ్ ఆన్‌లో ఉండడంతో నీటిలో విద్యుత్ ప్రవహించి జ్యోతి, అమూల్య అనే ఇద్దరు చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వెంటనే చిన్నారులను ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.