హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

CTR: యాదమరి మండలంలోని రామచంద్రాపురం వద్ద హైవేపై రోడ్డు దాటుతున్న మహారాష్ట్రకు చెందిన ఆకాశ్(35)ను కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.