హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అమరావతి ఉద్యమంలో రామారావు సేవలు చిరస్మరణీయం'

GNTR: తుళ్లూరులో ధనేకుల రామారావు సంస్మరణ సభ జరిగింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరావతి కోసం రామారావు కుటుంబం సుమారు 50 ఎకరాల భూమి ఇచ్చిందని తెలిపారు. ల్యాండ్‌ పూలింగ్‌పై రైతులకు అవగాహన కల్పించారని చెప్పారు. రైతుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.