హైదరాబాద్: 28°C
క్రీడలు

దూకుడుగా ఆడుతున్న విండీస్ ఓపెనర్లు

తిరువనంతపురం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో ఆ జట్టు 14 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 100 పరుగులు పూర్తి చేసుకుంది. జస్టిన్ గ్రీవ్స్ (58) అర్ధశతకం సాధించగా, కాంప్‌బెల్ (43) హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై అనుభవం లేని భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.