ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. స్క్వాష్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ రజత పతకం సాధించింది. ఫైనల్లో 4-11, 4-11, 7-11 తేడాతో మలేసియాకు చెందిన శివశంగరి సుబ్రహ్మణ్యం చేతిలో ఓటమిపాలైంది. దీంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఆసియా క్రీడల్లో మహిళల స్క్వాష్‌లో రజతం గెలిచిన తొలి ప్లేయర్‌గా అనాహత్ చరిత్ర సృష్టించింది.
క్రీడలు
ఆసియా గేమ్స్: స్క్వాష్‌లో భారత్‌కు రజతం


