హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కౌన్సిలింగ్ లేకుండా టీసీలు ఇవ్వడం సరికాదు'

ASR: సీతగుంట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 8మంది విద్యార్థులకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా టీసీలు ఇవ్వడంపై గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి మాధవరావు, బాబుజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలుంటే కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులతో చర్చించాల్సింది పోయి, బడి నుంచి పంపించడం సరికాదన్నారు. ఘటనపై విచారణ చేసి విద్యార్థులను తిరిగి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.