హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగించాలి'

BDK: మణుగూరు మండలంలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం బాపూజీ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.