హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

అన్నమయ్య: దుద్యాల గ్రామం చిన్నకోడివండ్ల పల్లెలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆదివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నూతన సచివాలయ భవనాన్ని పరిశీలించి, గ్రామ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువగా, వేగవంతంగా అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు.