హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి

సత్యసాయి: పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని షీ ఫారం, మహాదేవపల్లి గ్రామాల్లో నివాసం ఉంటున్న అర్హులైన లబ్ధిదారులకు బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత ఆదివారం ఉచిత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.