హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

BHPL: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు BHPL జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.