అన్నమయ్య: పొలం పనులు చేస్తుండగా పాము కాటేసి రైతు అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం నిమ్మనపల్లి మండలంలో జరిగింది. బాధితుని కుటుంబీకుల కథనం.. పిత్రిగట్టకు చెందిన రైతు రామకృష్ణ (50) పొలంలో పనులు చేస్తుండగా విషసర్పం కాటేసింది. వెంటనే 108 సిబ్బంది బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగ వైద్యులు పరీక్షించి, మెరుగైన చికిత్స అందించారు.
ఆంధ్రప్రదేశ్
పాము కాటు.. రైతుకు తీవ్ర అస్వస్థత..!


