హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాడి రైతులకు రాయితీతో పశుబీమా..!

KDP: పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం 85% రాయితీతో పశుబీమా కల్పిస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ నిత్యానంద తెలిపారు. మేలు జాతి పశువులకు రూ. 30 వేల బీమాపై రైతు వాటా రూ. 288, నాటు జాతి పశువులకు రూ. 144గా ఉంటుందన్నారు. గొర్రెలు, మేకలు, పందులకు రూ. 6 వేల బీమాపై రైతు వాటా కేవలం రూ. 27 మాత్రమేనన్నారు. బీమా చేయించుకుంటే మూడేళ్లపాటు రక్షణ ఉంటుందని తెలిపారు.