హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి'

NDL: నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ దారా సుధీర్ ఆదివారం డిమాండ్ చేశారు. రైతులు, రైతు కూలీల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.