KDP: అట్లూరు మండల ప్రత్యేక అధికారిగా సయ్యద్ అహ్మద్ మొహిద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. మండల ప్రజా పరిషత్ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించింది. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వుల మేరకు ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అట్లూరు ప్రత్యేక అధికారిగా అహ్మద్


