హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ముల్లంగితో మధుమేహానికి చెక్..!

ముల్లంగిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి బరువు నియంత్రణకు, టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుందని, అయితే దీన్ని నూనె, కొవ్వు పదార్థాలతో కాకుండా పచ్చిగా లేదా కూరగా తీసుకోవాలని సూచిస్తున్నారు.