కేరళ ఓనం బంపర్ లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. TL 360615 నంబర్ టికెట్‌కు ప్రథమ బహుమతి కింద రూ.30 కోట్ల భారీ జాక్‌పాట్ తగిలింది. కన్నూర్‌లోని తాలిపరంబలో ముత్తు ఏజెన్సీ దీన్ని విక్రయించగా, ఆ అదృష్టవంతుడు ఎవరో ఇంకా తెలియలేదు. పన్నులు, కమిషన్ పోను విజేతకు రూ.16.47 కోట్లు అందుతాయి. కాగా, ఈసారి ముద్రించిన మొత్తం 90 లక్షల లాటరీ టికెట్లు అమ్ముడుపోవడం ఓ సరికొత్త రికార్డు.
వార్తలు
అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల లాటరీ


