హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గంగమ్మ తల్లి పూజలు..!

KDP: లింగాల మండలం అంకెవానిపల్లె గ్రామంలో చాలా కాలం తర్వాత సమృద్ధిగా వర్షాలు కురవడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులంతా కలిసి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బిందెలతో నీరు పోసి అభిషేకం చేశారు.