హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు'

కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు టూ టౌన్ సీఐ హనీశ్ కుమార్ ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చి చట్టబద్ధమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని సీఐ సూచించారు. అల్లర్లు, గొడవలు, ఆక్రమ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.