హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మోపిదేవి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

కృష్ణా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు స్వామివారి నాగపుట్టలో పాలు పోసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని నాగవల్లి వృక్షానికి ముడుపులు కట్టి స్వామివారి కృప కోసం ప్రార్థించారు.